ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
శంకర్ పల్లి ఏప్రిల్ 04(ప్రజాక్షేత్రం): ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, సేంద్రియ వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హల్లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సేంద్రియ వ్యవసాయం అవగాహన కల్పించడానికి సేంద్రియ రైతు సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవా వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం లో ప్రకృతి సంరక్షించబడంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ప్రకృతి ఆధారిత సేంద్రియ వ్యవసాయని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. తాను త్రిపుర లో మంత్రి గా పనిచేసినపుడు సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించానని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సతీష్ రెడ్డి, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.