Praja Kshetram
తెలంగాణ

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ

 

హైదరాబాద్ ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం): హైదరాబాద్ లోని బషీర్ బాగ్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు విగ్రహానికి ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అలాగే దళిత పీడిత సమాజానికి చేసిన సేవను గూర్చి తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ కు భారత రత్న ప్రకటించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎన్ వై అశోక్, మచ్చ దేవేందర్, డప్పు మల్లికార్జున్, అరుణ్ ఎమ్మార్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు‌.

Related posts