బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.
– ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ
శంకర్ పల్లి ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం):స్వాతంత్ర సమరయోధుడు, దళిత జనబాంధవుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ సూచించారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని శంకర్ పల్లి మండల కేంద్రంలోని మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల వికాసం కోసం నిర్విరామంగా కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శాలు అందరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, భారత ఉపప్రధానిగా వివిధ పదవుల్లో దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమంలో ఆదర్శాలను ఆచరణలో చూపిన మహనీయుడి చరిత్ర భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ శంకర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ, మాజీ ఎంపిటిసి ఎర్రోళ్ల రామచందర్, నర్సింలు, ఉపాధ్యాయులు ఆశీర్వాదం సేవ ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ నరేష్ కుమార్, ఎంఈఎఫ్ మండల అధ్యక్షుడు కుశాల్ తెలంగాణ ఉద్యమకారుడు పండిత్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, ప్రశాంత్, సుధాకర్ రెడ్డి, నజీర్, ఉపాధ్యాయులు గోపాల్, శీను, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.