ఔట్సోర్సింగ్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి.
– ఏజెన్సీ రెన్యువల్ సమయం అయిపోయిందని తొలగించడం అన్యాయం.
– కొత్తగా రిక్రూట్ చేసే పోస్టుల్లో అవినీతి లేకుండా పారదర్శకంగా నియమించాలి.
– ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అండగా బిఆర్టియు ఉంటుంది.
– జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు.
నర్సంపేట ఏప్రిల్ 05(ప్రజాక్షేత్రం):నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల నుండి విధులు నివర్తిస్తున్న15 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా ఆస్పత్రిలో విధులను నిర్వర్తించుటకు తీసుకోవాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. గత 20 సంవత్సరాల నుండి సి హెచ్ సి ఏరియా ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఎఎన్ఎం, ఎల్ టి ఎల్ ఇ, డిఆర్ఎ, ఎంఎన్ఓ, జెఎసి డబ్ల్యూ, ఎస్ జి, పిసిసి, ఇసిజి, తదితర విభాగాల్లో అమ్మ ఏజెన్సీ క్రింద పనిచేస్తూ విధులు నిర్వర్తిస్తూ వచ్చే చాలీచాలని జీతాలతో కుటుంబాలను గడిపారని ఇప్పుడు జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయి మెడికల్ కళాశాలగా రూపుదిద్దుకున్న తర్వాత మెడికల్ కళాశాల మరియు జిల్లా ఆస్పత్రిలో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సుమారు 150 కి పైగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పోస్టులు కూడా మంజూరయ్యాయి. అట్టి పోస్టుల్లోకి సీనియారిటీ ప్రకారం వీరిని తీసుకోకుండా మీ ఏజెన్సీ రెన్యువల్ సమయము అయిపోయిందనె నేపంతో మీ ఏజెన్సీ జిల్లా ఆసుపత్రి పరిధిలోకి రాదని విధులనుండి తొలగించడం అన్యాయమని ఒకవైపు వైద్య విధాన పరిషత్ లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులను అప్ గ్రేడ్ అయినా జిల్లా ఆస్పత్రిలో వీరిని కొనసాగించాలని జీవో 45, 2022 సంవత్సరంలోనే మెడికల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన రాజకీయ ఒత్తిడితో ఆ జీవోను పట్టించుకోవడంలేదని ఫలితంగా ఇప్పుడు కార్మిక కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని కొత్తగా మంజూరైన 150 పోస్టులలో ఏజెన్సీ వారు పారదర్శకంగా నియమాకాలు చేపట్టకుండా తమకు అనుకూలంగా ఉన్నవారిని రాజకీయ ఒత్తిడితో అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయని పాత 15 మందిని కొనసాగిస్తే వారికి వచ్చే ముడుపులు రావని దురుద్దేశంతో వీరిని తొలగించడం అన్యాయమని అన్నారు. జిల్లా కలెక్టర్ డీఎంఈ. స్పందించి చొరవ చూపి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని వారికి అండగా బి.ఆర్.టి.యు జిల్లా కమిటీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా నాయకులు కొల్లూరి లక్ష్మి నారాయణ, రుద్రరాపు పైడయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.