Praja Kshetram
తెలంగాణ

స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం : కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం : కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

 

రంగారెడ్డి ప్రతినిధి ఏప్రిల్ 08(ప్రజాక్షేత్రం):నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పథకం ను నూతనంగా ఫ్రారంభంచడం జరిగందని, ఈ పథకం క్రింద అన్ని కార్పొరేషన్ లకు సంబంధంచిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడగించడం జరిగిందని, అన్ని మున్సిపాలిటీ, ఎంపిడిఓ కార్యాలయంలో ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పీడీ డిఆర్ డిఏ, ఈడి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నోడల్ అధికారులుగా ఉన్నారని, బ్యాంక్ మేనేజర్లు ఈ కార్యక్రమం పై ఒరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Related posts