మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో.. ముజ్రా పార్టీ! అర్థ నగ్న డ్యాన్సులు
మొయినాబాద్ ఏప్రిల్ 09(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ కలకలం రేపింది. మెయినాబాద్ ఏతబర్ పల్లి శివారులోని హాలీడే ఫామ్ హౌస్ లో ఓ బర్త్ డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారు. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు యువతులను, 14మంది యువకులుసహా 21 మందిని అరెస్టు చేశారు. ముజ్రా పార్టీ నిర్వాహకుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సదరు యువతులను మహిళలను రెస్క్యూమ్‌కు తరలించగా.. యువకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ నిర్వాహకులు ముంబై నుంచి యువతులను తీసుకొచ్చి ముజ్రా పార్టీ నిర్వహించినట్లుగా గుర్తించారు. పోలీసు దాడుల సమయంలో యువతీ యువకులు మద్యం సేవిస్తూ.. హుక్కా పీలుస్తూ ఒళ్లు తెలియకుండా అర్థ నగ్నంగా డ్యాన్సులు చేస్తూ మత్తులో ఉన్నారు. పార్టీ జరిగిన స్థలంలో మద్యం, హుక్కా, 70గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.