Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లి లో అసైన్మెంట్ భూములు కబ్జా…!

శంకర్ పల్లి లో అసైన్మెంట్ భూములు కబ్జా…!

 

– శంకర్ పల్లి లో ఎన్ని అక్రమాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు.

– పత్తాలేని శంకర్ పల్లి ఎమ్మార్వో.

– అంతా నా ఇష్టం! సబ్ అర్బన్ విల్లాస్ యాజమాన్యం.

– అధికారుల కనుసైగలోని ఈ అక్రమాలు.

– ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని శంకర్ పల్లి రెవెన్యూ అధికారులు.

శంకర్ పల్లి ఏప్రిల్ 09(ప్రజాక్షేత్రం):భూమి లేని నిరుపేదలైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు గతంలో ప్రభుత్వం అసైన్డ్ చేసింది. ఆ భూములను కేవలం సాగు చేసుకొని జీవనం సాగించాలని రెవెన్యూ చట్టం చెబుతున్నది. కానీ ఎట్టి పరిస్థితిల్లో ఆ భూమిని విక్రయించే అధికారాలు అసైన్డ్దారులకు లేదనే విషయం సుస్పష్టం. కొంత మంది పేదలు ఆ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులకు గురై భూములను విక్రయించుకుంటారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన నేతలకు చట్టానికి విరుద్ధమైన పనులు సక్రమం చేయడానికి రెవెన్యూ అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అదే పేదలు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకుని గూడు కోసం నిర్మాణాలు చేస్తే చట్ట ప్రకారం నేరమంటూ కూల్చివేయడం జరుగుతుంది. పెద్దలకు, పేదలకు వేరువేరుగా రెవెన్యూ చట్టాలు పనిచేస్తున్నాయా అంటే అవుననే సమాధానం శంకర్పల్లి రెవెన్యూ అధికారులు ఆచరణలో స్పష్టంగా కనిపిస్తున్నది.

– శంకర్ పల్లి అక్రమ అసలు కథ ఇది.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణకేంద్ర రెవెన్యూ పరిధిలోని 316 సర్వే నంబర్‌లో మొత్తం సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం ఈ భూమిని మొత్తం అసైన్డ్దారులకు పంపిణీ చేశారు. సర్వే నెంబర్ 316కు ఆనుకుని పక్కనే ఉన్న సర్వేనెంబర్ 313, 314, 315, లలో(సబ్ అర్బన్ విల్లాస్)అర్బన్ లివింగ్ విల్లాస్ 316 లోని అసైన్ భూమిపై కన్నేసింది. విల్లాస్ కు వెళ్లే ప్రధాన దారి (40 ఫీట్ల మట్టి రోడ్డు) కోసం, అసైన్ దారుల నుండి కొనుగోలు చేసిందన్న ప్రచారం ఉంది. అయితే 2019 నుంచి 2020 వరకు అసైన్డ్ దారుల నుండి ఈ భూమిని అసైన్డ్ రైతుల నుంచి కొనుగోలు చేసి విల్లాస్ యాజ్యమాన్యం తన వెంచర్ కు 40 ఫీట్ల రోడ్డు వేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విల్లాస్ కు ఎదురుగ మరికొంత అసైన్ భూమిని, లీజ్ పేరుతో ఓ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ షెడ్లు వేసింది. ఇలా శంకర్పల్లి పట్టణకేంద్ర రెవెన్యుపరిధిలోని 298, 316 లో మొత్తం 16 ఎకరాల అసైన్డ్ భూమి ప్రైవేటు ఆధీనంలోకి వెళ్ళింది. ప్రభుత్వం నిరుపేదలకు సాగు చేసుకుని ఇచ్చింది. అంతా కమర్షియల్ ఈ భూములలో అసైన్డ్ దారులు సాగుచేసుకున్న దాఖలాలు లేవు. భూములను అసైన్దారులు అమ్ముకోవడంతో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అనువుగా మారింది.

– ఆర్థివో ఆదేశాలు పత్త లేని ఎమ్మార్వో…

శంకర్ పల్లి సబర్బన్ విల్లాస్ బరితెగింపు’ ఈ విషయం పై శంకర్ పల్లి ఎమ్మార్వోను వివరణ కోరగా.. ఈ విషయం ఇప్పుడే తెలిసింది రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం అని 4 రోజులు గడిచిన శంకర్ పల్లి రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ 28 న చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డివో )కు ఫిర్యాదు చేశారు. ఈ భూములపై విచారణ చేయమని శంకర్ పల్లి ఎమ్మార్వోకు ఈ నెల 3 న ఆదేశాలు జారి చేశారు. అయినా శంకర్ పల్లి ఎమ్మార్వో ఇంతవరకు విచారణ చేయనితీరు అవినీతి ఆరోపణలకు అద్దంపడుతుందని స్థానిక ప్రజల విమర్శలు చర్చనీయఅంశంగా మారింది. అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూముల్లో ఇప్పుడు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎవరికీ అమ్మకూడదు. అసైనీ తదనంతం వారి వారసులకే దానిపై హక్కులుంటాయి. వారూ లేకుంటే ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకుంటుంది. అసైన్డ్‌ భూమిలో అసైనీ రైతు వ్యవసాయ అవసరాల కోసం తాత్కాలికంగా గుడిసెలు వంటివి వేసుకోవచ్చు తప్ప.. అసైనీలైనా, వేరే ఎవరైనా శాశ్వత నిర్మాణాలు చేయొద్దు. ఈ భూమిలో క్రయవిక్రయాలు, లీజులు చెల్లవు. పీవోటి 9/77 చట్టం ప్రకారం అసైన్డ్ భూములను ఇతరులకు అమ్మడం, తాకట్టు పెట్టడం, కౌలుకు ఇవ్వడం, దానం చెయ్యటం మరి ఏ విధమైన అన్యాక్రాంతం చేయకూడదని పి ఓ టి చట్టం 9/77 పేర్కొంది. ఈ భూములను అమ్మిన, కొనుగోలు చేసిన కబ్జా చేసిన ప్రభుత్వం పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తుందని తెలిసు, అయినా కొందరు రియల్ ఎస్టేట్ బడా కంపెనీల యాజమాన్యాలు నిబంధనలకు తూట్లు పొడిచి, అసైన్డ్, పోరంబోకు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల నిస్సహాయత, కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల సపోర్టుతో అక్రమార్కులు బరితెగించి అక్రమాలకు పాల్పడుతున్నారు. క్రయవిక్రయాలకు అవకాశం లేని అసైన్డ్‌ భూములను కొనేందుకు కొందరు రిలయల్టర్లు, వెంచర్ నిర్వాహకులు ప్రయత్నించారు. అసైన్డ్‌ భూములను రియల్టర్లకు విక్రయించడం కోసం కొందరు స్థానికులు ముందుండి వ్యవహారం నడిపించిట్లు ప్రచారం సాగుతుంది. అసైన్డ్‌ భూములను కొన్నా రిజిస్ర్టేషన్లు చేసుకోవడం కష్టమని తెలిసినా నోటరీతో విక్రయాలు జరిపారు. అసైన్డ్‌ భూములు క్రయవిక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుంటామని ఓ వైపు అధికారులు చెబుతున్నా మాటలు కోటలకే పరిమితమవుతున్నాయి. అసైన్ దారులే ఆక్రమణలకు సూత్రదారులయ్యారు. అమ్మకూడదని తెలిసి లీజ్ నోటరీ పేరుతో అడ్డదారిలో విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా భూముల ధర ఎకరా కోట్ల రూపాయలలో పలుకుతుంది. గతంతో పోలిస్తే పెట్టుబడిదారులు ఇతర రంగాలను కాదని చాలావరకు భూముల కొనుగోళ్లపైనే దృష్టి సారిస్తున్నారు. కొందరు రియల్టర్లు, పెట్టుబడిదారులు తక్కువధరలకు భూములు కొని ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయాలనే కాంక్షతో అసైన్డ్‌ భూములపై కన్నేశారు. ఇవి కొనడానికి, అమ్మడానికి వీల్లేదని చట్టం చెప్తున్నా అడ్డదారులను వెతుకుతూ చౌకగా భూములు కాజేశారు.

– శంకర్ పల్లి సబ్అర్బన్ విల్లాస్ యాజమాన్యం ఇష్ట రాజ్యం.

తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలకేంద్రంలోని రెవెన్యూ పరిధిలో సుమారు 60ఏళ్ల క్రితం భూములులేని నిరుపేదలకు సర్వే నెం.285, 286, 289,316 లలో సుమారు 16 ఎకరాల 32గుంటల భూమిని 41 మందికి ప్రభుత్వం అసైన్‌మెంట్‌ పట్టాలిచ్చింది. వీరిలో 90శాతం మంది ఎస్సీ లబ్ధిదారులు కాగా, పదిశాతం ఇతర వర్గాలున్నారు. వీరిలో ఎవ్వరు ఈ భూములను సాగు చేసుకుంటున్న దాఖలాలు లేవు. మార్కెట్లో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో శంకర్ పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 316 లో 6 ఎకరాల 15 గుంటలుభూమి విక్రయించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే 316 లో చిన్న శంకర్ పల్లి విలేజ్ రోడ్డు కు ఆనుకుని ఉన్న సుమారు 3 ఎకరాల అసైన్ భూమిని గ్రామానికి చెందిన కొందరు బ్రోకర్లు శంకర్ పల్లి” సబ్ అర్బన్ విల్లాస్”(వెంచర్) యాజ్యమాన్యంతో కుమ్మక్కయ్యి లబ్ధిదారులతో మాట్లాడి అసైన్ భూములను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అసైన్ దారులకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఇప్పించినట్లు తెలిసింది. ఆ నోటా ఈ నోటా వ్యవహారం కాస్తా బయటికి పొక్కడంతో, అసైన్ దారులు ఈ భూములు అమ్మలేదని, కేవలం లీజ్ కు ఇచ్చామని చెపుతున్నారు. కాని ప్రైవేట్ విల్లాస్ వెంచర్ నిర్వాహకులు (శంకర్ పల్లి సబ్అర్బన్ విల్లాస్) ఈ భూముల్లో నుండి 40 ఫీట్ల రోడ్డు వేసి ఆక్రమించారు. విల్లాస్ నిర్వాహకులు త్వరలో ఈ రోడ్డు సీసీ రోడ్డు వేసే ప్రయత్నంలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంకర్ పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 316లో సుమారు ఎకరాలు అసైన్డ్ భూమి ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి.

– ప్రభుత్వ భూమి మట్టు మాయం.

ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇంత అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన మండల రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ పై నేరుగా రెవెన్యూ శాఖ అధికారి ఫిర్యాదు(లిఖిత పూర్వకంగా) చేసి 10రోజులు గడిచిన, చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. శంకర్ పల్లి మండల కేంద్రంలోని బిల్ల అకౌంట్ (ప్రైవేట్)వెంచర్ నిర్వాహకులు ఏకంగా సుమారు 2 ఎకరాల ప్రభుత్వ (పోరంబోకు) భూమిని కబ్జా చేసి వెంచర్ పరిధిలో కలిపేసుకుని చుట్టూ కాంపౌండ్ నిర్మించారు. ఇదే విషయమై శంకర్ పల్లి రెవెన్యూ శాఖ అధికారి డిప్యూటీ ఎమ్మార్వో కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్న చర్యలు తీసుకోలేరు.

Related posts