బహుజనుల రాజ్యాధికారమే భవిష్యత్తు పోరాట లక్ష్యం
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
– సిద్ధాంతంతో పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమన్న ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రిన్సిపాల్ డాక్టర్ ఖాసీం
బిజినేపల్లి, ఏప్రిల్ 09(ప్రజాక్షేత్రం):కేంద్రం లో, రాష్ట్రాల్లో బహుజనుల రాజ్యాధికారమే భవి ష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేం ద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని బీసీ సం ఘం నాయకులు గంగనమోని కిరణ్, నాయినోళ్ల బాల్‌రాజు గౌడ్, దళిత బహుజన సంఘం రాష్ట్ర నాయకుడు మంగి విజయ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఫూలే విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు అంతటి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే చట్ట సభల ఎన్నికల్లో జనాభా దా మాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆయా పార్టీలు సీట్లు కేటాయించకపోతే అన్ని స్థానాల్లో బహుజనులు పోటీలో ఉండి గెలిచి సత్తా చాటాలని అన్నారు. అనగారిన వర్గాల ప్రజలంతా ఏకతాటిపై వచ్చి ఐకమత్యం తో బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయ కుడిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించుకుంటేనే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రిన్సిపాల్ డాక్టర్ ఖాసీం మాట్లాడుతూ సిద్ధాం తంతో పోరాటం చేస్తేనే బహుజనుల రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. సిద్ధాంతం రూపొందించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరా వు ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించు కోవడంతోనే ఆగిపోకుండా ఆయన చూపినబాటలో సాగాలన్నారు. అంతకు ముందు ప్రొఫెసర్లు డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్, డాక్టర్ సాయి బాబా, బీ సీ రాష్ట్ర నాయకుడు దిలీపాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడారు. గిద్దె రాంనర్సయ్య, రేలారే గంగ, జయప్రకాశ్, డప్పు లక్ష్మణ్, రాజు, విజయకాం త్‌ల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఫూలే విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆరు వేల మందికి పైగా బహుజనులు హాజరై విజయ వంతం చేయడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. మండల బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటస్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంత్ గౌడ్, సత్యశిల సాగర్, రామన్ గౌడ్, రఘుబాబు, రాము నాయక్, గంగారం అశోక్, గోవిందు, నాగరాజు, గంగన మోని తిరుపతయ్య, శ్రీను, తుమ్మల అల్లోజీ, కరిగళ్ల దశరథం, విల్సన్, దేశెట్టి రాజేష్, మల్లేష్ గౌడ్, పృధ్వీరాజు, సుదర్శన్, దామోదర్, కిషోర్, విజయ్ తదితరులు ఉన్నారు.