మహాత్మా ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి:మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ ఏప్రిల్ 11(ప్రజాక్షేత్రం):భారతీయ సామాజిక విప్లవజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని అంబర్ పేటలో గల వారి విగ్రహానికి ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ” దేశంలో సామాజిక సమానత్వం కోసం, విద్యావ్యాప్తి కోసం,సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా ఫూలే దంపతులకు “భారతరత్న” ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.