Praja Kshetram
తెలంగాణ

గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత

గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత

 

ఖమ్మం ఏప్రిల్ 12(ప్రజాక్షేత్రం):మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన ఆయన ఇంటి పేరే వనజీవి అయింది. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. కోటికిపైగా మొక్కలు నాటిన రామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

Related posts