రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పెంచాలి.
– సర్వర్ డౌన్ సమస్యతో దరఖాస్తుదారుల ఆందోళన.
– ప్రభుత్వం దృష్టి సారించి ఈనెల చివరి వరకు గడువు పెంచాలి.
నిజామాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 13(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ వికాస్ ప్రతి గ్రామానికి చేరుకొని ప్రజలు రాజీవ్ యువ వికాస్ లో మీసేవ ఆన్లైన్ ద్వారా వారి అప్లికేషన్స్ చేసుకుంటున్నారు.ఈ సంగతి అందరికీ తెలిసింది.అయితే ఈనెల 14 చివరి తారీకు రాజీవ్ వికాస్ యొక్క గడువు ముగియానుంది. కావున మీసేవ ఆన్లైన్ సెంటర్ లో నందు సర్వర్ రాకపోవడంతో ప్రజలు దరఖాస్తులు చేసుకుందాము అనుకున్నగాని అప్లై కాకపోవడంతో ప్రజలు గడువు ముగుస్తుంది అనే భయం,మరోపక్క సర్వర్ డౌన్ ఉండుట్ల అప్లై అవ్వకపోవడంతో దరఖాస్తుదారులు భయం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు దరఖాస్తుదారులు కులం ఆదాయం ధృవీకరణ పత్రాలు లేక మూడు రోజులు ప్రభుత్వ సెలవుతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల చివరి వరకు గడువు పెంచాలని దరఖాస్తుదారులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గడువు పెంచినట్లయితే మరికొందరం దరఖాస్తు చేసుకుంటామని అంటున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి గడువు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.