ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
– ఆడుకుంటూ కార్ లోనే ఉడిపోయిన చిన్నారులు
– దామరగిద్దలో ఘటన
చేవెళ్ల ఏప్రిల్ 14(ప్రజాక్షేత్రం):అమ్మమ్మోళ్ల ఇంటికి వచ్చి కార్ లో ఆడుకుంటాముని చెప్పినా ఇద్దరు చిన్నారులు మృతురాలుగా మారిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దామరగిద్ద వార్డ్ లో చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని పామేనా గ్రామానికి చెందిన కావాలి వెంకటేష్ జ్యోతి దంపతుల కూతురు తన్మయిశ్రీ (6),షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కూతురు అభినయ శ్రీ (4)ఇద్దరు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఆడుకుంటాముని వెళ్లారు. కార్ లో ఉన్నారు అన విషయం ఎవరు గమనించలేదు.బయట ఎక్కడో ఆడుకుంటున్నారు అనుకున్నారు బంధువులు చిన్నారుల మేనమామ రాంబాబు కార్ లాక్ పడడంతో డోర్ తీయడానికి రాక ఊపిరి ఆడక ఇద్దరు స్పృహ కోల్పోయిన నట్లు మధ్యాహ్నం 2గంటలకు గమనించిన బంధువులు చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.దింతో వైద్యులు పరీక్షలు నిర్వహించి మృతిచెందినట్లు తెలిపారు.