Praja Kshetram
తెలంగాణ

రిమాండ్ ఖైదీని ములాఖత్లో వీడియో తీసిన యువకులు – సోషల్ మీడియాలో వీడియో వైరల్

రిమాండ్ ఖైదీని ములాఖత్లో వీడియో తీసిన యువకులు

 

– సోషల్ మీడియాలో వీడియో వైరల్

– చంచల్గూడ జైలు సిబ్బందిపై అధికారులు సీరియస్

హైదరాబాద్ ఏప్రిల్ 15(ప్రజాక్షేత్రం): చంచల్‌గూడ జైలు ఖైదీ ములాఖత్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అహ్మద్‌ బిన్‌ హసన్‌ అల్‌ జాబ్రీని అనే వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం(ఏప్రిల్ 11) అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

– సోషల్ మీడియాలో వైరల్

అతడిని ములాఖత్‌లో కలిసేందుకు శనివారం(ఏప్రిల్ 12) ఇద్దరు యువకులు చంచల్గూడ జైలుకు వెళ్లారు. అనంతరం వారు నిందితుడు అహ్మద్తో మాట్లాడుతూ మొబైల్లో వీడియో తీశారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై జైలు అధికారులు సీరియస్‌ అయ్యారు.

– సిబ్బందిపై చర్యలకు సిఫార్సు

వీడియో తీసిన ములాఖత్‌దారుతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన జైలు సిబ్బందిపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చంచల్గూడ జైలు పర్యవేక్షణ అధికారి నవాబు శివకుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Related posts