Praja Kshetram
తెలంగాణ

కుక్కల దాడిలో గాయపడిన విద్యార్థి పట్టించుకోని గ్రామ కార్యదర్శి

కుక్కల దాడిలో గాయపడిన విద్యార్థి పట్టించుకోని గ్రామ కార్యదర్శి

 

శంకర్ పల్లి ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):విచ్చలవిడిగా కుక్కలు జనాలపై స్వైర విహారం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం రాత్రి మహమ్మద్ హమీద్ ఐదో తరగతి రేవతి స్కూల్ విద్యార్థి తీవ్ర రక్త గాయాలకు గురైన సంఘటన శంకర్ పల్లి మండల్ పరిధిలోని దొంతన్ పల్లి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ కార్యదర్శికి విద్యార్థి తండ్రి మహమ్మద్ ఖాదర్ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని తనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అన్నారు. విద్యార్థి ఒంటిపై కనిపిస్తున్న రక్త గాయం చేస్తుంటే అదృష్టవశాత్తు ప్రాణగండం తప్పినట్లు అర్థమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం నుండి కూడా ఇలాంటి సంఘటనలు హైదరాబాదులో జరుగుతున్నాయని టీవీలో పత్రికలు కూడా చూపిస్తున్న విషయాన్ని నరేష్ కుమార్ గుర్తు చేశారు. కాబట్టి వెంటనే కార్యదర్శి ఎంపీడీవో, ఎమ్మార్వో, స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నరేష్ కుమార్ సూచించారు.

Related posts