పట్టాలపై విరిగిపడ్డ చెట్టు… రైళ్ల రాకపోకలకు అంతరాయం
వికారాబాద్, ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండలం మమదాన్ పల్లి గ్రామ సమీపంలో గాలివానకు రైల్వే పట్టాలపై చెట్టు విరిగిపడింది. చుట్టుపక్కల రైతులు అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. దీంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని రైలు పట్టాలపై పడ్డ చెట్టును తొలగించారు.