Praja Kshetram
తెలంగాణ

జగ్గారెడ్డి దాతృత్వం.. క్యాన్సర్ బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం

జగ్గారెడ్డి దాతృత్వం.. క్యాన్సర్ బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం

 

– మాస్ లీడర్ జగ్గారెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

సంగారెడ్డి ఏప్రిల్ 22(ప్రజాక్షేత్రం):మాస్ లీడర్ జగ్గారెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స చేయించుకోలేక పోతున్న బాధితురాలికి తానున్న అంటూ భరోసా నందించాడు. చికిత్స కోసం అవసరమైన రూ.10 లక్షలను స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అందజేశాడు. సదాశివపేట కు చెందిన ఆమని గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమె భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో బతుకు దయనీయంగా మారింది. అందులో ఆమెకు క్యాన్సర్ వ్యాధి రావడంతో ఇప్పటి వరకు రూ.7 లక్షల అప్పులు చేసింది. విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం బాధితురాలు ఇంటికి వెళ్లి తక్షణ సాయంగా రూ.10 లక్షల అందజేసి మంచి మనసును చాటుకున్నారు. తనకున్న వ్యాధితో నరకం అనుభవించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమని జగ్గారెడ్డి తో బోరున విలపిస్తూ చెప్పింది. ఇలాంటి భయం అవసరం లేదంటూ నేనున్నానంటూ జగ్గారెడ్డి ఆమెకు భరోసాను అందించారు.

– క్యాన్సర్ స్క్రీనింగ్ గొప్ప ఆలోచన.

సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు. తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు. కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకు వచ్చానన్నారు. పేదలకు ఇలాంటి రోగాలు వస్తే, కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Related posts