Praja Kshetram
జాతీయం

15ఏళ్ల సర్వీస్​లో 14బదిలీలు

15ఏళ్ల సర్వీస్​లో 14బదిలీలు

 

– ఎక్కువ జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్​గా రికార్డ్​

– ఎవరీ ఐఏఎస్ అమిత్ గుప్తా?

నేషనల్ బ్యూరో ఏప్రిల్ 22(ప్రజాక్షేత్రం):ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా బదిలీలు, ప్రమోషన్లు సాధారణమే. అయితే ఉత్తర్​ప్రదేశ్ క్యాడర్​కు చెందిన ఓ ఐఏఎస్ మాత్రం 15 సంవత్సరాల సర్వీసులో ఏకంగా 14 సార్లు బదిలీ అయ్యారు. దీంతో ఎక్కువ జిల్లాల్లో పనిచేసిన కలెక్టర్​గా రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ ఐఏఎస్ ఎవరు? అన్నిసార్లు ఎందుకు ట్రాన్స్​ఫర్ అయ్యారు? కారణాలు ఏంటి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

– యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి.

ఉత్తర్​ప్రదేశ్‌ క్యాడర్​కు చెందిన 2000వ బ్యాచ్ ఐఏఎస్ అమిత్ కుమార్ గుప్తా స్వస్థలం మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్. ఈయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్​లో గ్రాడ్యుయేట్, పబ్లిక్ అఫైర్స్​లో పీజీ పూర్తి చేశారు. 2000లో సివిల్స్​లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్​గా ఎంపికయ్యారు. తొలుత మేరఠ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆగ్రాలో జాయింట్ మేజిస్ట్రేట్​గా పనిచేశారు.

– ఫస్ట్ జాబ్ అక్కడే.

అమిత్ గుప్తా మొదటిసారి 2005లో హమీర్‌పుర్‌కు జిల్లా మేజిస్ట్రేట్​గా నియమితులయ్యారు. ఆ తర్వాత లలిత్​పుర్ కలెక్టర్​గా కేవలం 8రోజులే సేవలందించారు. అమిత్ కెరీర్ ఎక్కువ కాలం కలెక్టర్​గా పనిచేసింది బదౌన్ జిల్లాలోనే. అక్కడ రెండున్నరేళ్లు పనిచేశారు. తన 15 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 14 సార్లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో 2015లో ఎక్కువ జిల్లాల్లో(14) మేజిస్ట్రేట్‌గా పనిచేసినందుకు ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్​లో నమోదైంది.

– లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్.​

అదనపు బాధ్యతలు అప్పగించిన యూపీ సర్కార్
కాగా, ఉత్తర్​ప్రదేశ్ సర్కార్ సోమవారం రాత్రి 33 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అయితే ప్రస్తుతం స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న అమిత్ గుప్తాకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో యూపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వైద్య విద్య కార్యదర్శి, సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కూడా సేవలందించారు అమిత్ గుప్తా.

– 14 జిల్లాల్లో కలెక్టర్ సేవలు.

కాగా, అమిత్ గుప్తా ఇప్పటివరకు ఆగ్రా, హమీర్​పుర్, లలిత్​పుర్, కన్నౌజ్, జలౌన్, ఫిరోజాబాద్, ప్రతాప్​గఢ్, మహరాజ్‌ గంజ్, ఇటావా, బదౌన్, ఫిలీబిత్, బిజ్నౌర్, శ్రావస్తి, లఖింపుర్ ఖేరీ జిల్లాల్లో కలెక్టర్​గా పనిచేశారు.

 

Related posts