అఘోరి వైద్యపరీక్షలు పూర్తి.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
– మహిళకు టోకరా వేసిన కేసులో అఘోరీకి రిమాండ్
– పూజల పేరుతో మహిళ నుంచి రూ.10 లక్షలు వసూలు
– పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
– అఘోరీని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
శంకర్ పల్లి ఏప్రిల్ 23(ప్రజాక్షేత్రం):మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరీని మోకిల పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరీ తో పాటు అతని భార్య శ్రీ వర్షిణితో కారులో హరిద్వార్ వెళుతుండగా మోకిలా పోలీసులు పక్కా ప్రణాళికతో ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.
– నార్సింగ్ లో రెండు గంటల పాటు విచారణ
అఘోరీ ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రెండు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం పోలీసులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
– కోర్టులో రిమాండ్
చేవెళ్ల ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు చేవెళ్ల కోర్టు లో న్యాయమూర్తి ఎదుట అఘోరీని హాజరుపరిచారు. న్యాయమూర్తి అగోరిని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలించారు.
– అఘోరి ఆడనా.. మగనా..
కంది జైలు అధికారులు అఘోరిని ఏ బారక్ లో ఉంచాలో నిర్ధారించుకోక తిరిగి చేవెళ్ల కు తరలించారు.చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్ జెండర్ అని తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు నగరంలోని చంచల్గూడా జైలు కు తరలించినట్లు సమాచారం. అఘోరీ భార్య చేయవలసిన తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు నగరంలోని హైదర్ షాక్ హోటల్ లోని కస్తూర్బా గాంధీ హోం కు తరలించినట్లు సమాచారం.
– అఘోరీ వద్దే ఉంటా..
అల్లూరి శ్రీనివాస్ కు కోర్టు రిమాండ్ విధించడంతో.. వర్షిణిని తాత్కాలికంగా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అయితే, తనను కూడా శ్రీనివాస్ వద్దకే పంపాలని శ్రీవర్షణి గొడవ చేస్తోంది. నానా హంగామా చేస్తుంది. అఘోరీ శ్రీనివాస్ తనకు వారం రోజుల్లో బయటకు వస్తా అని చెప్పినట్టు చెబుతోంది. తనను కూడా లేడీస్ జైల్లో ఉంచాలని వీరంగం సృష్టించింది. బీటెక్ కూడా కంప్లీట్ చేయించాలని.. ఆ బాధ్యత పోలీసులే తీసుకోవాలని వర్షిణి డిమాండ్ చేస్తోంది. అలా కుదరదు అంటున్న పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగుతోంది. అరుపులు, తిట్లు, ఏడుపులతో పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేస్తోంది.
– వర్షిణి మానసిక పరిస్థితి బాగోలేదు..
వర్షిణి మానసిక ఆరోగ్యంపై ఏమాత్రం బాగోలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లు రీ హాబిలిటేషన్ సెంటర్లో ఉంచి చికిత్స చేయించాలని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు వర్షిణి కోసం ఆమె తల్లిదండ్రులు శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తమతో ఇంటికి వచ్చేయాలని కూతురు వర్షిణిని వేడుకున్నారు.
– పీఎస్ లో వర్షిణి నానా హంగామా..
అయితే, పేరెంట్స్తో వెళ్లేందుకు వర్షిణి ఇష్టం పడడం లేదు. అఘోరీ శ్రీనివాస్ తోనే ఉంటానని హంగామా చేస్తుంది. అవసరమైతే తన అత్తారింటికి వెళ్తానంటూ అరుస్తోంది. తల్లిదండ్రులతో ఉండేందుకు అసలు ఇష్టం చూపట్లేదు. తమ కూతురుని తమతో పంపించాలని పోలీసులను వేడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. మంగళగిరి తీసుకెళ్తామని.. కావాలంటే అక్కడే రీ హాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తామని వర్షణి పేరెంట్స్ చెబుతున్నారు. అయితే, వర్షిణిని మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని.. పేరెంట్స్ తో పంపించలేమని పోలీసులు చెప్పారు.