రజితొత్సవ సభకు భారీగా తరలి రావాలి.
– మహాసభకు కదం తొక్కాలి..
– మాజీ ఎంపిపి ధర్మానగారి గోవర్ధన్ రెడ్డి
శంకర్ పల్లి ఏప్రిల్ 25(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించే పార్టీ రజితోత్సవ సభకు మండలం నుండి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు తరలిరావాలని శంకర్ పల్లి మాజీ ఎంపిపి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లాలని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.