27న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ ఏప్రిల్ 25(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ -10వ తరగతి వరకు గల సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామన్నారు. ఈ సారి మొత్తంగా 40,332 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు.