Praja Kshetram
తెలంగాణ

ప్రత్యక్ష ప్రసారాల వల్ల రక్షణ కార్యకలాపాలకు ముప్పు: కేంద్ర సర్కార్

ప్రత్యక్ష ప్రసారాల వల్ల రక్షణ కార్యకలాపాలకు ముప్పు: కేంద్ర సర్కార్

 

 

హైదరాబాద్ఏ ప్రిల్ 26(ప్రజాక్షేత్రం):జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది ప్రజలు ప్రాణాలు కోల్పో యారు. దీంతో భారత -పాకిస్థాన్ సరిహద్దు లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నా యి. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యల కు దిగుతుంది, భారత్ సై న్యం అందుకు తగ్గట్టుగానే దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో దేశంలో మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున మీడియా కవరేజ్ విషయంలో మోదీ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అదే టైంలో సోషల్ మిడియా యూజర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది.  పాకిస్థాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణ పరంగా ప్రభుత్వం కీలక మైన చర్యలు తీసుకుంటుం ది. వాటిని కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని తెలిపింది.మీడియాకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ఫామ్లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు.’ అని పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది.ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దని కేంద్రం సూచించింది. జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయ కుండా ఉండాలని మీడియా ఛానెళ్లకు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ఫారమ్లు, వార్తా సంస్థలు , సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ మరియు ఇతర భద్రతా సంబంధిత కార్యకలా పాలకు సంబంధించిన విషయాలను నివేదించే టప్పుడు అత్యంత బాధ్యత వహించాలని, ప్రస్తుత చట్టాలు ,నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రియల్-టైమ్ కవరేజ్, దృశ్యాల ప్రసారం, రక్షణ కార్యకలాపాలు సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయొద్దని చెప్పింది. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రువులకు సహాయం చేసినట్టే అవుతుందని అన్నారు. దేశం ప్లాన్ను అమలు చేయడంలో ఇబ్బంది కలగడమే కాకుండా సైన్యం భద్రతకు ప్రమాదం కలిగించవచ్చు అని తెలిపారు. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడుల సమయం లో ఇలాంటి ఘటనలు ము ప్పు తెచ్చినట్టు మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. ‘అపరిమిత కవరేజ్ జాతీయ ప్రయోజనాలపై ఊహించని ప్రతికూల పరిణామాలను కలిగిం చిందని’ ఆందోళన వ్యక్తం చేసింది. “గత ఘటనలు బాధ్యతా యుతమైన రిపోర్టింగ్ ప్రాముఖ్యత గుర్తు చేస్తున్నాయి. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో అపరిమిత కవరేజ్ ప్రతికూల పరిణా మాలకు కారణమైంది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Related posts