టీజీపీఎస్పీ ఆధ్వర్యంలో GPO పరీక్షల నిర్వహణ
హైదరాబాద్ ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. భూభారతి ఆర్వోఆర్- 2025 చట్టంలో పేర్కొన్న ట్టుగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి. అందుకే గ్రామ పాలన అధికారుల GPO,ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలకు పరీక్ష నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష నిర్వ హణ కూడా పారదర్శకంగా ఉండాలని టీజీపీఎస్సీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరీక్ష కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అనుకూలంగా ఉండే భవనాలను కూడా గుర్తించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. వచ్చే నెల పదో తేదీన పరీక్ష నిర్వహించే చాన్స్ ఉంది. అయితే, తేదీల నిర్ణయాన్ని టీజీపీఎస్సీకే వదిలేశారు. రెవెన్యూ శాఖలో జీపీవో లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. రేపటితో అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగియ నుంది.