రేపు రాలేను, విచారణకు మరో తేదీ కేటాయించండి – ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ
– ఈడీ అధికారులకు లేఖ రాసిన నటుడు మహేశ్‌బాబు
– షూటింగ్ ఉన్నందున రేపు విచారణకు రాలేకపోతున్నట్లు ఈడీకి లేఖ
– మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు మహేశ్‌బాబు లేఖ
హైదరాబాద్ ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):నటుడు మహేశ్బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున రేపు(సోమవారం) విచారణకు రాలేకపోతున్నట్లు ఈడీకి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను కోరారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో మహేశ్బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేపు(సోమవారం) విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం మహేశ్బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సాయిసూర్య డెవలపర్స్కు ప్రచారకర్తగా నటుడు మహేశ్బాబు ఉన్నారు.