ముంబయి సూపర్ విక్టరీ- బుమ్రా దెబ్బకు లఖ్నవూ విలవిల
– సొంతగడ్డపై ముంబయి గ్రాండ్ విక్టరీ- లఖ్నవూ ఓటమి
ప్రజాక్షేత్రం డెస్క్: ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయం సాధించింది. సొంతగడ్డపై ఆదివారం లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో ముంబయి 54 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముంబయి నిర్దేశించిన 216 టార్గెట్ ఛేదనలో లఖ్నవూ ఓవర్లన్నీ ఆడి 161 స్కోర్కే ఆలౌటైంది. బదోనీ (35), మిచెల్ (34) పోరాడారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో సత్తా చాటాడు. ట్రెంట్ బౌల్ట్ 3,విల్ జాక్స్ 2, బాష్ 1 వికెట్లు దక్కించుకున్నారు. భారీ లక్ష్య ఛేదనలో లఖ్నవూకు ఆరంభంలోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మర్క్రమ్ (9)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. మార్ష్తో పూరన్ (27) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఏడో ఓవర్లో జాక్స్ పూరన్, పంత్ (4)ను ఔట్ చేసి ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బదోనీ (35), డేవి్ మిల్లర్ (24) ఆశలు రేకెత్తించారు. కానీ బదోనీని బౌల్ట్, మిల్లర్ను బుమ్రా పెవిలియన్ చేర్చి ముంబయి విజయాన్ని దాదాపు కన్ఫార్మ్ చేశారు.