పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పట్టపగలే దారుణ హత్య.
పెద్దపల్లి బ్యూరో, ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం దారుణ హత్య జరిగింది. మృతుడు అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ (40)ను కత్తితో గొంతు కోసి చంపిన యువకుడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్ గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. నిందితుడు తో పాటు ఓ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.