Praja Kshetram
పాలిటిక్స్

జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. శాంతి చర్చలపై మాట్లాడే అవకాశం

జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. శాంతి చర్చలపై మాట్లాడే అవకాశం

 

– ఇద్దరు మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

హైదరాబాద్ ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం రేవంత్ చర్చించనున్నారు. నిన్న ఆదివారం సీఎం రేవంత్ తో శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా, సామాజిక కోణంలోనే కాంగ్రెస్ పార్టీ చూస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉన్నందున ఆయనతో చర్చించి మంత్రివర్గ సహచరులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కారణంగానే జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య శాంతి చర్చల అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఆదివారం వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ప్రసంగ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుని, తదుపరి కేంద్రానికి ఏ విధంగా విన్నవించాలని అంశాన్ని ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలుస్తుంది

Related posts