కేటీఆర్‌కు గాయాలు..! ఆందోళనలో బిఆర్ఎస్ శ్రేణులు
హైదరాబాద్ ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా.. కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని, అప్పటివరకు బెడ్ రెస్ట్ అవసరం అని సూచించినట్లు చెప్పారు. చివరగా త్వరలోనే సొంత కాళ్లపై నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు. దీనిపై కేటీఆర్ అభిమానులు స్పందిస్తూ.. తమ నేత ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.