Praja Kshetram
క్రిడలు

14 ఏళ్ల కుర్రాడే కూత కూస్తే 36 బంతుల్లో 101 స్కోర్..

14 ఏళ్ల కుర్రాడే కూత కూస్తే 36 బంతుల్లో 101 స్కోర్..

 

– గుజరాత్ టీం పై తన బ్యాటింగ్ తో ఐపీఎల్ లో రికార్డ్

హైదరాబాద్ ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ బ్యాట్స్మెన్ గా వైభవ్ ఐపీఎల్ మ్యాచ్ లోనే అతి చిన్న వయసులో తనదైన రికార్డును సొంతం చేసుకున్నాడని చెప్పడంలో అతిశక్తి లేదు. కేవలం 36 బంతుల్లోనే 101 స్కోర్ చేసి గుజరాత్ బాలర్లకు గుబులు పుట్టించాడు. ప్రత్యర్థి బాలర్లు సైతం ఆ పిల్లోడి బ్యాటింగ్ చూసి ఫిదా.. అయ్యారు. అంటే ఆ కుర్రోడు ఆడిన తీరేంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క బాలు ఆ కుర్రోడి బ్యాటింగ్ కు బౌండరీలను తాకుతూ శభాష్ అనిపించేలా ఆధ్యాంతం మ్యాచ్ కొనసాగిందంటే ఆడియన్స్ కూత ఏ మేరకు వినిపించిందో అర్థమవుతుంది. తనదైన రేంజ్ లో వైభవ్ వైభవంగా బ్యాటింగ్ చేశాడు అని చెప్పడం హాట్సాఫ్ అనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ గా వైభవ్ పేరుకు తగ్గట్టే వైభవంగా ఆడాడు. ఒక్కో బంతిని బౌండరీలకు పరిగెత్తించి ఫీల్డింగ్ చేసే వారికి ముచ్చెమటలు పట్టించాడు. ఆ కుర్రోడి బ్యాటింగ్ తీరును చూసిన బౌలర్లు కూడా శబాష్ అని పొగిడారు.

 

Related posts