Praja Kshetram
తెలంగాణ

ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్.. వీళ్లందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..

ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్.. వీళ్లందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..

 

 

హైదరాబాద్ ఏప్రిల్ 29(ప్రజాక్షేత్రం):గతంలో పరిష్కారంకాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూ సమస్యలపై ధరణిలో చేసుకున్న అప్లికేషన్లను రిజెక్ట్ అవుతున్నాయి. భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రావడం, అలాగే, కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దరఖాస్తుదారులు భూ భారతి పోర్టల్లోనే మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని అధికారులు అంటున్నారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, అందులోనూ మాన్యువల్గా దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణలో భూ భారతి పోర్టల్ను తీసుకొచ్చే సమయానికి ధరణిలో 81,000కుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను భూ భారతి పోర్టల్కు బదిలీ చేశారు. భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు తహసీల్దార్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయుల్లో అధికారాలను వికేంద్రీకరించడంతో చిన్నపాటి సమస్యలలు తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం అవుతాయి.దీంతో ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. అయినప్పకటికీ అధికారులు కారణాలు చెప్పకుండానే పాత దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రిపోర్ట్లు సైతం పెట్టకుండానే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పరిష్కారం కాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారు. పెట్టుకుంటున్నారు. భూ భారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును భూ భారతి చట్టంలోని నిబంధనల కిందే పరిష్కరించాల్సి ఉంది. ఏ దరఖాస్తును తిరస్కరించినా సరైన కారణం చెప్పాలి.

Related posts