గొంతు వాపు, మింగడంలో ఇబ్బందిగా ఉందా? – “థైరాయిడ్” హెచ్చరికలు ఎలా ఉంటాయంటే!
థైరాయిడ్ క్యాన్సర్ బాధితుల్లో లక్షణాలు – నిపుణులు ఏమంటున్నారంటే!
థైరాయిడ్ గ్రంధి అనేది జీవక్రియ నియంత్రణ, పెరుగుదల, అభివృద్ధి వంటి కొన్ని ప్రాథమిక విధులను నిర్వహిస్తుంది. అయితే, ఈ గ్రంధిలో కొన్ని మార్పుల కారణంగా థైరాయిడ్ క్యాన్సర్కు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలు ప్రారంభంలోనే గుర్తించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్యాన్సర్ లక్షణాలు, హెచ్చరికల సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
– గొంతు వాపు
థైరాయిడ్ క్యాన్సర్ అత్యంత సాధారణ ప్రారంభ సంకేతాల్లో ఒకటి గొంతులో నొప్పిలేని గడ్డలు. మరి ముఖ్యంగా థైరాయిడ్ ప్రాంతంలో ఈ గడ్డలు అనేవి థైరాయిడ్ నాడ్యూల్ సంకేతం కావచ్చనని నిపుణులు అంటున్నారు. ఈ గడ్డ అనేది అకస్మాత్తుగా కనిపించవచ్చు లేదా నిదానంగా పెరుగుతూ రావచ్చు అని చెబుతున్నారు. ఈ గడ్డలు సర్వసాధారణంగా అపాయకరమైనవి కానప్పటికీ కొన్ని సార్లు క్యాన్సర్ రావడానికి సంకేతమని పేర్కొన్నారు.
ఏ వయస్సులోనైనా థైరాయిడ్ నోడ్యూల్స్ అభివృద్ధి చెందవచ్చని నిపుణులు తెలిపారు. కానీ, ఈ సమస్య సాధారణంగా వృద్ధుల్లో కనిపిస్తుందని తన పరిశోధనలో వెల్లడించింది. మెడలో ఇలాంటి గడ్డలు కనిపిస్తే సంబంధిత డాక్టర్లను సంప్రదించడం మంచిదని పేర్కొంది.
– వాయునాళంపై ఒత్తిడి
అన్నవాహిక లేదా వాయునాళంపై కణితి కలిగించే ఒత్తిడి కారణంగా ఏవైనా మింగడానికి లేదా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. థైరాయిడ్ గ్రంధి క్యాన్సర్ కారణంగా నోటి నుంచి ఆహారాన్ని తీసుకువెళ్లే అన్నవాహిక వరకు ప్రభావం చూపిస్తుందని వివరించారు. దీంతో ఏవైనా ఆహారపదార్థాలు తినడానికి కష్టతరంగా లేదా అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
– గొంతు బొంగురుపోవడం
థైరాయిడ్ క్యాన్సర్ స్వర తంతువులను నియంత్రించే నరాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. దీంతో గొంతు బొంగురుపోవడం, గర్జన స్వరం లేదా సాధారణంగా మాట్లాడే స్వరంలో ఇతర మార్పులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి మార్పులు కాలక్రమేణా మరింత సృష్టంగా కనిపిస్తాయని వివరించారు. ముఖ్యంగా క్యాన్సర్కు సంబంధించిన కణితులు స్వర తంతువులకు దగ్గరగా ఉన్నప్పుడు నిరంతరం గొంతు బొంగురుపోవడం లేదా స్వరంలో మార్పు అనేది ధైరాయిడ్ క్యాన్సర్కు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.
– వేగంగా పెరిగే గడ్డలు
తక్కువ సమయంలో వేగంగా పెరిగే గడ్డలు రావడం అనేది థైరాయిడ్ క్యాన్సర్కు సాధారణ లక్షణం. సాధారణ నోడ్యూల్స్ లాగా కాకుండా క్యాన్సర్ కణితులు వేగంగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
– వివరించలేని నొప్పి
మెడ లేదా గొంతులో నిరంతర నొప్పి, ముఖ్యంగా జలుబు లేగా ఇతర సాధారణ అనారోగ్యాలతో సంబంధం కలిగి ఉండడం థైరాయిడ్ క్యాన్సర్ను సూచిస్తుదంటున్నారు నిపుణులు. క్యాన్సర్ సమీపంలోని శోషరస కణుపులకు వ్యాపించినట్లయితే ఈ నొప్పి తీవ్రంగా ఉంటుందట. తద్వారా మెడ లేదా గొంతులో మరింత చికాకుకు దారితీస్తుందని వివరించారు.
– వాపు
థైరాయిడ్ క్యాన్సర్ కారణంగా ఆడమ్స్ ఆపిల్ అనేది పెద్దదిగా మారితే, అది మెడ ప్రాంతంలో గుర్తించదగిన వాపునకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
– శ్వాస సమస్యలు
థైరాయిడ్ గ్రంధి పెరిగేకొద్దీ అది శ్వాసనాళంపై కూడా ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శారీరంగా చురుకుగా ఉన్నా, రోజూ సరైన విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఇలాంటి సమస్య వస్తే వెంటనే డాక్టర్లు సంప్రదించడం మేలని సూచిస్తున్నారు.
– ఇతర లక్షణాలు
-తీవ్రమైన దగ్గు
ఇన్ఫెక్షన్లతో సంబంధం లేకుండా సాధారణ జలుబు, దీర్ఝకాలిక దగ్గు లాంటి లక్షణాలు థైరాయిడ్ క్యాన్సర్ సంకేతమని నిపుణులు తెలిపారు. వీటితో పాటు అలసట, ఆకలి లేకపోవడం, వికారం లేదా వాంతులు, ఊహించని బరువు తగ్గడం లాంటి లక్షణాలు అనేవి థైరాయిడ్ క్యాన్సర్ ఇతర లక్షణాలు ఉంటాయని పేర్కొంది.
NOTE : థైరాయిడ్కు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.