Praja Kshetram
తెలంగాణ

ఓయూ ప‌రిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

ఓయూ ప‌రిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

 

హైదరాబాద్ మే 01(ప్రజాక్షేత్రం):ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్‌డ‌బ్ల్యూ తదితర అన్ని కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 8వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్లో చూసుకోవచ్చని సూచించారు.

Related posts