ఫ్లాష్ ఫ్లాష్…అటువంటి వారి రేషన్ కార్డులు రద్దు.. ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం
హైదరాబాద్ మే 02(ప్రజాక్షేత్రం):దారిద్య రేఖకు దిగువ ఉన్న వారికి సహాయం అందించి వారికి కొంత ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ప్రతినెలా వారికి రేషన్ సరుకులు అందిస్తుంది. నిరుపేదలు వాటికి అర్హులు. కానీ అర్హత లేని వాళ్ళు వాటిని పొందితే అది ప్రభుత్వ ఖజానాకి సమస్య అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు అనర్హులైన వారి రేషన్ కార్డులను ఏరిపారేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో ఒక భారీ స్కాం జరుగుతుందని గమనించింది. ఈ క్రమంలో అధికారులు నకిలీ, బోగస్ మరియు అర్హత లేని వాళ్ళ రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 శాతం రేషన్ కార్డులు నకిలీ అంటూ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 10.44 లక్షల రేషన్ కార్డులు బోగస్ అనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి బోగస్ రేషన్ కార్డులో ఉన్న వాళ్లకు కూడా ప్రతి నెల 600 కోట్ల రూపాయల సబ్సిడీ అందుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించడం జరిగింది. అనర్హులైన రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు ప్రతినెలా కూడా 6 కేజీల బియ్యం రేషన్ కార్డు ద్వారా పొందుతున్నారు. ఈ విధంగా అనర్హులైన వాళ్లందరూ ప్రతినెలా 12 కోట్ల కేజీల బియ్యం పొందుతున్నారు.
ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మధ్యకాలంలో పౌరసరఫరాల శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిశీలనలు చేసి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులలో 1,36,000 అక్రమ రేషన్ కార్డులు ఉన్నాయని గుర్తించింది. పౌరసరఫరాల శాఖ వారు గుర్తించిన లబ్ధిదారులు ఎవరు పేదవాళ్లు కాదని తెలుస్తుంది. ఈ లబ్ధిదారులకు కార్లు కూడా ఉన్నాయి. అలాగే వీళ్లకు పెద్ద పెద్ద భవనాలు, ఇల్లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయని పరిశీలనలో తేలింది. ఈ లబ్ధిదారులు చాలా ఆస్తులు ఉండి కూడా నిరుపేదలు లాగా రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. అర్హులైన పేదలకు చెందాల్సిన రేషన్ సరుకులను వీరు అక్రమంగా కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది