Praja Kshetram
క్రైమ్ న్యూస్

లంచంతో ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ అధికారి

లంచంతో ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ అధికారి

 

వికారాబాద్, మే 02(ప్రజాక్షేత్రం):ఓ అధికారికి సంబంధించిన టీఏ బిల్లు పాస్ చేయడం కోసం సంబంధిత అధికారీ నుండి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే శ్రీధర్ ను నగదుతో అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి జిల్లా శాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం… ఓ అధికారికి సంబంధించిన టీఏ బిల్లు పాస్ చేయడం కోసం రూ.8వేలను శ్రీధర్ డిమాండ్ చేయగా, సంబంధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శుక్రవారం సాయంత్రం 4:00 ప్రాంతంలో ఏసీబీ అధికారులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శ్రీధర్ ను నగదుతో పాటు అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్ పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు వెంటనే నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు.

Related posts