నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ సర్వేయర్ గా మారే సువర్ణావకాశం
సైదాపూర్ మే 03(ప్రజాక్షేత్రం): హుజూరాబాద్ ఆర్డిఓ పరిధిలోని మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒక గొప్ప శుభవార్త అందించింది. 10+2 లేదా డిగ్రీ పూర్తి చేసి 60 సంవత్సరాల లోపు ఉండి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ల్యాండ్ సర్వేయర్ గా స్థిరపడేందుకు న్యాక్ ప్రత్యేక శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ కేవలం 90 రోజుల పాటు హుజూరాబాద్ పాత డిగ్రీ కళాశాల క్యాంపులో నిర్వహిస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్ తో హైదరాబాద్ లో 42 రోజులు శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం ల్యాండ్ సర్వేయర్ లైసెన్స్ లభిస్తుంది. ఈ లైసెన్సు ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శిక్షణ పొందడానికి ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వానికి రూ.14700 చెల్లించాల్సి ఉంటుంది. కావునా హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట, శంకరపట్నం, ఇల్లందకుంట మండలాలకు చెందిన నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాక్ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్ హుజూరాబాద్ పాత డిగ్రీ కళాశాల క్యాంపులో సంప్రదించండి లేదా 7396988875, 7989250779 నెంబర్లను ఫోన్ చేసి పూర్తి వివరాలు తెసుకోగలరని శిక్షణ కేంద్రం ఇంచార్జీలు నక్క స్నేహలత, ఆధాం తెలిపారు.