Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఆఫీసును ఓయో రూమ్ గా మార్చేసుకున్న ఉద్యోగి.. ఎక్కడో కాదు మన విజయవాడలోనే!

ఆఫీసును ఓయో రూమ్ గా మార్చేసుకున్న ఉద్యోగి.. ఎక్కడో కాదు మన విజయవాడలోనే!

 

– ఆఫీసును ఓయో రూమ్ గా మార్చేసుకున్న ఉద్యోగి.. ఎక్కడో కాదు మన విజయవాడలోనే!

– పనివేళలు ముగిసిన తర్వాత మహిళతో వచ్చి ఆఫీసు తాళాలు తెరిచిన ఉద్యోగి

– సీసీటీవీ కెమెరాలో రికార్డైన ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం

– విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

విజయవాడ మే 04(ప్రజాక్షేత్రం):విజయవాడలోని ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఓయో రూమ్ గా మార్చేసుకున్నాడో ఉద్యోగి.. పనివేళలు పూర్తయ్యాక ఆఫీసుకు తాళం వేసి అందరూ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సదరు ఉద్యోగి తిరిగి ఆఫీసుకు వచ్చాడు. తన వద్ద ఉన్న తాళం చెవులతో ఆఫీసులోకి ప్రవేశించాడు. పెండింగ్ పని పూర్తిచేయడానికి వచ్చాడేమో అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఆయన వెంట ఓ మహిళ కూడా ఉంది. ఇద్దరూ లోపలికి వెళ్లి కొద్ది సమయం తర్వాత తిరిగి బయటకు వచ్చారు. ఆపై ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన విజయవాడ టూరిజం డివిజనల్ ఆఫీసులో చోటుచేసుకుంది.

టూరిజం డివిజనల్ ఆఫీసులో కీలక ఉద్యోగి కావడంతో తనను అడిగే వారు లేరనే ధైర్యమో లేక మరేమిటో కానీ మహిళతో దర్జాగా తన ఇంట్లోకి వెళ్లినట్లు ఆఫీసు తాళం తెరిచి లోపలికి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సదరు డిపార్టుమెంట్‌లో కలకలం రేపింది. కార్యాలయం ప్రవేశ ద్వారంలో, లోపలా అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో సదరు ఉద్యోగి నిర్వాకం రికార్డైంది. దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక అందగానే సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరించారు. అయితే సదరు ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఆ శాఖలో కలకలం రేపింది. సదరు ఉద్యోగి ఒక్కరేనా.. ఇంకా ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

Related posts