Praja Kshetram
బిజినెస్

రద్దు చేసినా చలామణిలో రూ.2000 నోట్లు- ఆర్బీఐ కీలక ప్రకటన

రద్దు చేసినా చలామణిలో రూ.2000 నోట్లు- ఆర్బీఐ కీలక ప్రకటన

 

– రూ.6,266 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడి

ప్రజాక్షేత్రం డెస్క్: రూ.2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. పెద్ద నోట్లను రద్దు చేసినా అవి ఇంకా చలామణిలోనే ఉన్నాయని పేర్కొంది. మే 19, 2023న రూ.2000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. అయితే ఆ నోట్లు రద్దయి రెండేళ్లైనా ఇంకా రూ.6,266 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ పెద్దనోట్లను రద్దు చేసే నాటికి దేశంలో రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. 30 ఏప్రిల్ 2025 నాటికి దేశంలో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల కరెన్సీ విలువ రూ.6,266 కోట్లకు తగ్గినట్లు చెప్పింది. రూ. 2,000 నోట్లలో 98.24 శాతాన్ని రికవరీ చేసినట్లు సెంట్రల్ బ్యాంకు చెబుతోంది. రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకుల్లో అవకాశం ఉండేది. ఆ తర్వాత నుంచి కేవలం ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే పెద్దనోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. 2023 అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ కార్యాలయాలు లేదా సంస్థల ద్వారా మాత్రమే రూ.2వేల నోట్ల మార్పిడికి అవకాశం ఉంది. ఆర్బీఐ సంస్థలతో పాటు దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచి అయినా ఇండియా పోస్ట్ ద్వారా ఏ ఆర్‌బిఐ కార్యాలయానికైనా రూ. 2000 నోట్లను పంపి తమ బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేసుకోవడానికి రిజర్వు బ్యాంకు అవకాశాన్ని కల్పించింది.

Related posts