పగిలిన డ్రైనేజ్ పైప్ లైన్లు.. దుర్వాసన తట్టుకోలేక అవస్థలు పడుతున్నా ప్రజలు
శంకర్ పల్లి మే 04(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో ఆదివారం డ్రైనేజ్ పైప్ లైన్ లీక్ అయ్యి, అందులోని మురుగు నీరు బయటకు ఉబికి వచ్చి మార్కెట్ రోడ్డు మీద పారాయి. ఆ డ్రైనేజీ పైపులైన్లకు, సులబ్ కాంప్లెక్స్ నీరు రెండు కలవడం వలన రోడ్లపై దుర్వాసన భరితమైన నీళ్లు పారడంతో స్థానిక వ్యాపారస్తులు, పాదాచారులు, కూరగాయల వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత పది రోజుల్లో మూడు సార్లు ఈ నీరు బయటకు వచ్చింది. కూరగాయల మార్కెట్ లోని మురుగంత ఈ పైపులైన్లో కలవడం వలన మాటిమాటికి పైపులైన్లు జామై నీరు బయటికి వస్తుంది. ఆ పైపులైన్ లో నీరు మామూలు నీరు అయితే పర్వాలేదు గాని, సులబ్ కాంప్లెక్స్ లో నీరు కరవడం వలన దుర్గంధ వాసన బయటకు రావడం జరుగుతుంది. వాసన భరించలేక వ్యాపారస్తులు వ్యాపారాలు చేయలేకపోతున్నారు. వెంటనే మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.