Praja Kshetram
తెలంగాణ

భారత్-పాక్ యుద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్..!

భారత్-పాక్ యుద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్..!

 

 

హైదరాబాద్ మే 10(ప్రజాక్షేత్రం):భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయం, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ బస్ స్టేషన్, టాంక్‌బండ్ వంటి కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నగరం మొత్తం అలర్ట్ జోన్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ తిరుమల, విశాఖపట్నం ఆర్‌కే బీచ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఎంజీ రోడ్‌లలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. భద్రతా బలగాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తూ, సోషల్ మీడియాలో వ్యాప్తిచెందుతున్న ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, భద్రతా చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related posts