Praja Kshetram
విద్యా సమాచారం

రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..!

రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..!

 

 

హైదరాబాద్ మే 10(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG EAPCET(EAMCET) 2025 పరీక్ష ఫలితాలు రేపు (మే 11, 2025) విడుదల కానున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) తరపున నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోండిలా..!

అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.inని సందర్శించండి.

హోమ్‌పేజీలో “TG EAPCET 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.

“సబ్మిట్” బటన్‌పై క్లిక్ చేయండి.

ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది.

ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి

Related posts