Praja Kshetram
తెలంగాణ

‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్.. తాజా అప్‌డేట్ ఇదే..!

‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్.. తాజా అప్‌డేట్ ఇదే..!

 

 

హైదరాబాద్ మే 10(ప్రజాక్షేత్రం):రాజీవ్ యువ వికాసం కార్యక్రమం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 02, 2025 నాటికి మంజూరు పత్రాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రి భట్టి విక్రమార్క, అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో, ఈ కార్యక్రమం ద్వారా యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా, న్యాయంగా, సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. జూన్ 02 నాటికి పంపిణీకి సిద్ధంగా ఉండేలా అన్ని జిల్లాల్లోనూ సన్నాహాలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, మరియు ఆర్థిక సహాయం వంటి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Related posts