Praja Kshetram
తెలంగాణ

ఏఐతో పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం : సీఎం రేవంత్ రెడ్డి

ఏఐతో పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం : సీఎం రేవంత్ రెడ్డి

 

– నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభం

– సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

– సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ జీసీసీ హబ్‌గా మారిందన్న సీఎం

హైదరాబాద్ మే 12(ప్రజాక్షేత్రం):ఏఐతో పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలో సొనాట సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం సాఫ్ట్‌వేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాల్లో హైదరాబాద్‌ జీసీసీ హబ్‌గా మారిందన్నారు.

– లక్షకు పైగా ఉద్యోగాలు

కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని, ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహకారం కోరుతున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని, మరిన్ని ప్రపంచస్థాయి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Related posts