Praja Kshetram
తెలంగాణ

ఆలయ నిర్మాణానికి లక్ష విరాళం అందజేత

ఆలయ నిర్మాణానికి లక్ష విరాళం అందజేత

రాజేంద్రనగర్, మే 14(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ మున్సిపాలిటీ గౌలిదొడ్డి కేశవ నగర్ కాలనీలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి లక్ష రూపాయలను వట్టినాగులపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ నాగేష్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం నాడు అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ నాగేష్ యాదవ్ మాట్లాడుతూ….. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తానని ఆయన అన్నారు, ఆపదలో ఉన్న వారికి ప్రతినిత్యం అండగా నిలుస్తానని ఆయన తెలిపారు.

Related posts