Praja Kshetram
తెలంగాణ

తెలంగాణలో మరో కొత్త పథకం.. వృద్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

తెలంగాణలో మరో కొత్త పథకం.. వృద్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

 

 

తెలంగాణ బ్యూరో మే 15(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పధకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం కోసం పధకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమంగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా ఒంటరితనంతో బాధపడే వృద్ధులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ఈ డే కేర్ సెంటర్లు ఒక వేదికగా ఉపయోగపడనున్నాయి. ఈ కేంద్రాల్లో వృద్ధుల కాలక్షేపం కోసం వినోద కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాలు, వైద్య సంరక్షణ, మానసిక మద్దతు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ చర్య ద్వారా వృద్ధులు సమాజంతో సంబంధాన్ని కొనసాగించడంతో పాటు, వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా మెరుగుపడనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వృద్ధుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఆసరా పెన్షన్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాయితీ ఛార్జీలు, ప్రత్యేక వైద్య సేవలు ఉన్నాయి. ఈ కొత్త డే కేర్ సెంటర్ల ఏర్పాటు ఈ సేవలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ కేంద్రాలు వృద్ధులకు రోజువారీ సంరక్షణను అందించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా వృద్ధుల సంరక్షణ బాధ్యత నుండి కొంత ఉపశమనం కల్పిస్తాయి. ఈ డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు, బడ్జెట్ కేటాయింపులు, అమలు తేదీలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related posts