Praja Kshetram
తెలంగాణ

ఎక్స్‌పీరియమ్‌ ఎకో పార్క్‌ చూసి ముగ్ధులైన మిస్ వరల్డ్ మోడల్స్

ఎక్స్‌పీరియమ్‌ ఎకో పార్క్‌ చూసి ముగ్ధులైన మిస్ వరల్డ్ మోడల్స్

 

– ఎక్స్‌పీరియమ్‌ ఎకో పార్క్‌ను సందర్శించిన మిస్‌వరల్డ్‌ సుందరీమణులు

– అతిథులకు ఎకో పార్క్ ప్రత్యేకతలు వివరించిన యజమాని రాందేవ్‌రావు

– చిన్నారులతో కలిసి మొక్కలు నాటిన మోడల్స్

శంకర్ పల్లి మే 16(ప్రజాక్షేత్రం):మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఇవాళ పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ చిలుకూరు సమీపంలోని ఎక్స్పీరియమ్ ఎకో పార్క్ను సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన అందాల భామలు పార్క్ అందాలను వీక్షించారు. దేశ, విదేశాల నుంచి సేకరించిన అరుదైన జాతి మొక్కలు, వాటి ప్రత్యేకతల గురించి పార్క్ యజమాని రాందేవ్ రావు వారికి వివరించారు. అద్భుతంగా తీర్చిదిద్దిన పార్క్ను, అందులో ఉన్న అరుదైన మొక్కలు, అద్భుతమైన శిల్పాలను, థీమ్ మోడల్స్ను చూసి ముద్దుగుమ్మలు మంత్రముగ్ధులయ్యారు. ఎకో పార్క్ అందాల మధ్య అందాల భామలు సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. అక్కడి చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. జనవరిలో ప్రారంభమైన ఈ పార్క్ 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దేశ, విదేశాలకు చెందిన 85వేల వృక్షజాతులు, థీమ్ పార్కులతో రాందేవ్ రావు దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడి చెట్లు, మొక్కల ఖరీదు రూ. లక్ష నుంచి మూడున్నర కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో ఉన్న శిల్పాల విలువ కూడా రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖరీదు చేస్తాయి. ఇందులో అడ్వైంజర్ పార్క్, స్నో పార్క్, ఫొటో ఫ్రెండ్లీ జోన్ అంటూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Related posts