కారు డోర్ లాక్.. నలుగురు చిన్నారుల మృతి.
ప్రజాక్షేత్రం, వెబ్డెస్క్:ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కారు డోర్ లాక్ కావడంతో నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారంపూడి లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులో సరదాగా కూర్చునేందుకు వెళ్లి చిన్నారులు డోర్ వేసుకున్నారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక నలుగురు మృతి చెందారు. మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేవరాజుపురంలో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి వెళ్లిన గౌతమి(7), శాలిని(6), అశ్విన్(7) ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు. కారు ఓనర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డోర్ లాక్ చేసే ముందు లోపల ఎవరైనా ఉన్నారేమో చూడాలని, పార్క్ చేసిన సమయంలో తప్పనిసరిగా లాక్ చేయాలన్నారు.
