Praja Kshetram
సినిమా న్యూస్

జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్

జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్

 

 

– కీలక నిర్ణయం తీసుకున్న తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు

హైదరాబాద్ మే 18(ప్రజాక్షేత్రం): తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తీర్మానించారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. సమావేశానికి దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అయితే ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఎప్పటి నుంచో పర్సంటేజీల విషయంపై చర్చ జరుగుతోంది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. కానీ పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్స్ వాదిస్తున్నారు. దీంతో ఈ విషయం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు లేఖ రాయనున్నారు.

Related posts