Praja Kshetram
క్రైమ్ న్యూస్

పిన్నిసు మింగి చిన్నారి మృతి

పిన్నిసు మింగి చిన్నారి మృతి

 

వర్గల్‌ మే 19(ప్రజాక్షేత్రం):ఆట వస్తువులోని పిన్నిసు మింగడంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని నాచారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన షోయబ్‌ ఖాన్‌ నాచారంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 14 నెలల వయసు గల షోయబ్‌ఖాన్‌ కుమార్తె ఆటవస్తువులోని పిన్నిసు మింగింది. వెంటనే పాపను ఆర్వీయం ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిలోఫర్‌ హాస్పిటల్‌కి తరలించారు. నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారి తండ్రి షోయబ్‌ ఖాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు గౌరారం ప్రొబేషనరీ ఎస్సై కీర్తి రాజు తెలిపారు.

Related posts