తాగునీటి కోసం సింగాపూరం వాసుల ఆందోళన.. ఖాళీ బిందెలతో నిరసన
శంకర్ పల్లి మే 19(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపూరం వార్డులో ప్రజలకు, గ్రామస్తులకు తాగునీటి కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి సరఫరా లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. దీన్ని నిరసిస్తూ సింగాపూరం ప్రజలు, మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. మండలం లో ఎక్కడ లేని సమస్య సింగాపూరంలో ఎలా ఏర్పడుతుందని, పరిష్కరించడంలో అధికారులు, విఫలమయ్యారా..? అంటూ గ్రామ వాసులు నిప్పులు చెరిగారు. ఏది ఏమైనా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళాలు కోరారు.
– సక్రమంగా అందని భగీరథ నీళ్ళు..
సింగాపూరం వార్డు కు భగీరథ నీళ్లు సక్రమంగా అందడం లేదు. నీళ్లు ఎప్పుడొస్తాయో..? కూడా తెలియదు.. నీళ్లు వచ్చిన రాకున్నా అధికారులకు అవసరం లేదు వారికి నెలాఖరులోగా జీతాలు వస్తే చాలు. ఇష్టారాజ్యంగా భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిత్యం గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ గ్రామ ప్రజలకు ఆ తాగునీళ్లు అందించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిత్యం తాగునీళ్లు అందే విధంగా చూడాలి.