హ్యుందాయ్ కారుపై ఏకంగా రూ. 58,000 డిస్కౌంట్..
– ఫీచర్లు, మైలేజ్ చూస్తే కొనేయడమే బెటర్ బ్రదర్..!!
వెబ్ డెస్క్ (ప్రజాక్షేత్రం):మోటార్స్ నుంచి వచ్చిన కార్లలో ఐ20 చాలా ఫేమస్ మోడల్ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఇప్పటికే పదికి పైగా వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ మోడల్ మోడల్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా ఐ20 సివిటి మోడల్ కారును వేరియంట్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో విడుదలై చక్కటి స్పందన పొందుతోంది. గతంలో మోడల్ లో మాత్రమే ఆటోమేటిక్ మోడల్ అందుబాటులో ఉండేది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.47 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉండేది. కానీ Hyundai తాజాగా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను Magnaలో కూడా పరిచయం చేసింది. దీని ధర రూ.8.89 లక్షలు మాత్రమే. అంటే Sportz CVT కన్నా రూ.58,000 తక్కువ ధరకు లభిస్తోంది. Hyundai i20 Magna CVT వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీని ద్వారా గేర్ లెస్ గా మీరు కారు ఆటోమేటిగ్గా నడపవచ్చు. ఈ కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే 1.2 లీటర్ Kappa పెట్రోల్ ఇంజిన్ ఇందులో గమనించవచ్చు. అలాగే ఈ కారు పికప్ పవర్: 83PS @ 6000 rpm సామర్థ్యంతో, టార్క్: 114 Nm @ 4200 rpm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. BS6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్ కాలుష్యకారకాలను నిరోధిస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, Hyundai i20 Magna CVT మైలేజ్ ఒక లీటర్ పెట్రోలుకు 19.65 km మైలేజ్ అందిస్తుంది. ఇక ఇందులో సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS (Anti-lock Braking System) తో EBD, రియర్ పార్కింగ్ సెన్సర్లు, సీట్ బెల్ట్ రిమైండర్ (డ్రైవర్, కో-డ్రైవర్), స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఇమొబిలైజర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఇన్‌ఫోటైన్‌మెంట్ కోసం 2-DIN ఆడియో సిస్టమ్, USB, Bluetooth కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లుగా చెప్పవచ్చు.