Praja Kshetram
తెలంగాణ

కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకోవాలి..

కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకోవాలి..

 

– టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు

ఎం. సత్యనారాయణ, ఎం . సైదులు

– సంఘం బలోపేతానికి కృషి చేయాలి

– యూనియన్ నేతలు గణేష్, సురేష్, చంద్రశేఖర్

– టీ డబ్ల్యూ జె ఎఫ్ రాజేంద్రనగర్ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్ష కార్యదర్శులుగా ఎ. గోపాల్, ఇ. బుచ్చన్న

శంషాబాద్, మే 20(ప్రజాక్షేత్రం):జర్నలిస్టులందరూ ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని రంగారెడ్డి జిల్లా టి డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. సత్యనారాయణ ఎం. సైదులు పిలుపునిచ్చారు. మంగళవారం శంషాబాద్ లోని పద్మావతి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విస్తృత స్థాయి సమావేశం నేషనల్ కమిటీ సభ్యులు బి. దేవేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా యూనియన్ సీనియర్ నాయకులు గణేష్ , సురేష్ కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈనెల 12 వ తేదీన మరణించిన ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు విక్రమ్ రావుకు నివాళులు అర్పించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, సైదులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జర్నలిస్టుల పరిస్థితి ఏమి మారలేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. హక్కులు సాదించుకోవడం కోసం యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలని సూచించారు. సీనియర్ నాయకులు గణేష్ , సురేష్, చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మరింత బలోపేతంగా ఎదగడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ నిబద్ధత అంకితభావంతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. యూనియన్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సమస్యల సాధన కోసం కార్యచరణ తో ముందుకు వెళ్లాలన్నారు. అక్రిడిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, విద్యలో రాయితీ, ఇళ్ల స్థలాలు సాధించడం కోసం పోరాటాలు నిర్వహించాలన్నారు. జిల్లా నూతన కమిటీ సభ్యులుగా బి. దేవేందర్, కే. సుదర్శన్ గౌడ్, ఎం. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ యూనియన్ నాయకులు నర్సింహా రెడ్డి , సీనియర్ జర్నలిస్టులు పి. విక్రమ్ కుమార్ , జాన్ తదితరులు పాల్గొన్నారు.

– నూతన కమిటీ ఎన్నిక

రాజేంద్రనగర్ నియోజకవర్గం టి డబ్ల్యూ జేఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఏ. గోపాల్, ఇ. బుచ్చన్న, ఉపాధ్యక్షులుగా ఇ. ప్రభాకర్, పి. నర్సింహ యాదవ్, పి. మాధవ చారి, కోశాధికారిగా ఎ . భానుమూర్తి, సహాయ కార్యదర్శులుగా కె. సతీష్ బాబు, పి. యాదగిరి, మద్దూర్ శ్రీనివాస్, సలహాదారు కోళ్ల యాదయ్య, ప్రచార కార్యదర్శిగా ఆర్. జ్ఞానేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

Related posts